తెలంగాణ ఇంటర్ ఫలితాలపై ఆందోళనల నేపథ్యంలో బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ కీలక నిర్ణయం తీసుకుంది. ఫెయిల్ అయిన విద్యార్థులందరికీ ఉచితంగా రీ వెరిఫికేషన్ చేస్తామని ప్రకటించింది. పరీక్షల్లో ఉత్తీర్ణులు కాని విద్యార్థులు రీ వెరిఫికేషన్ కోసం దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. సమాచార కేంద్రాలు, ఇంటర్నెట్ సెంటర్ల వద్ద ఇందుకోసం స్టూడెంట్స్ లైన్లులో నిలబడాల్సిన అవసరం లేదని చెప్పింది. బోర్డే స్వచ్ఛందంగా ఆ పని చేస్తుందని అధికారులు ప్రకటించారు.
#Pragatibhavan
#kcr
#abvp
#nsui
#sfi
#telangana
#interresults
#interboard
#andhrapradesh
#telanganastateboardofintermediate